మర్డర్ కేసులో మధ్యప్రదేశ్ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మర్డర్ కేసులో మధ్యప్రదేశ్ మంత్రి

December 14, 2017

మధ్యప్రదేశ్  మంత్రి లాల్‌సింగ్  ఆర్య ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో.. గత రెండు రోజుల నుంచి ఆయన  ఆచూకి లేకుండా పోయాడు. మంత్రిని  అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  అప్పటి నుంచి ఆయన  అజ్ఞాతంలోకి వెళ్లాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మఖన్‌లాల్ జాతవ్‌‌ను 2009,ఏప్రిల్ 13న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ హత్యకు మంత్రితో సంబంధాలు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు.కానీ  ఈ ఘటనలో తన ప్రమేయం ఏం లేదని మొదట  లాల్‌సింగ్ కోర్టుకు తెలిపాడు. కానీ విచారణ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేను హత్య చేయించింది మంత్రి లాల్ సింగ్ అని  కోర్టు దోషిగా తేల్చింది. డిసెంబర్ 5న స్పెషల్ జడ్జీ యోగేశ్ గుప్తా ఈ కేసులో లాల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. డిసెంబర్ 19కి తదుపరి  విచారణను వాయిదా వేశారు. ఈ లోపు కోర్టులో లాల్‌సింగ్‌ను ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. మరి అజ్జాతంలోకి వెళ్లిన ఆ మంత్రిగారు తదుపరి విచారణకు హాజరవుతారో లేదో చూడాలె.