ట్రాఫిక్‌ను 10 నిమిషాలకు మించి ఆపొద్దు.. హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్‌ను 10 నిమిషాలకు మించి ఆపొద్దు.. హైకోర్టు

March 9, 2018

మద్రాస్ హైకోర్టు ట్రాఫిక్ నిలివేతపై కీలక మార్గదర్శకాలు చేసింది. వీఐపీలు వెళ్తుంటే.. ట్రాఫిక్‌‌ను ఐదు నుంచి పది నిమిషాలకంటే ఎక్కువ సేపు నిలిపివేయొద్దని పోలీసులను ఆదేశించింది. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి లేక ఇతరులు ఎవరికోసమైనా సరే ట్రాఫిక్‌ను అంతకుమించి నిలిపివేయరాదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ప్రధానిల పర్యటనలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.పోలీసులు విచక్షణ లేకుండా ట్రాఫిక్ ను నిలిపేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ తీర్పు చెప్పింది. గత ఏడాది మార్చి 22న హైకోర్టు ప్రాంగణంలో నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారని, అందువల్ల తాను అపాయిమెంట్  తీసుకున్న సమయానికి డాక్టర్‌ను కలువలేకపోయాని హైకోర్టు న్యాయవాది దొరైస్వామి ఈ పిటిషన్ వేశారు. ఇందుకు బాధ్యులైన నగర ట్రాఫిక్ పోలీసులపై చర్యలను తీసుకుకోవాలని కోరాడు. అయితే ఈ కేసులో ఎవరిపైనా చర్యలు తీసుకోలేమని హైకోర్టు చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేయడమే పిటిషనర్ ముఖ్య ఉద్దేశమని  చెప్పింది. ట్రాఫిక్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టదని సూచించింది.