సరిహద్దులే లేకుంటే.. మేరీ మెహబూబా జిందాబాద్ - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దులే లేకుంటే.. మేరీ మెహబూబా జిందాబాద్

April 9, 2018

దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  అతని తనయుడు ఆకాశ్ పూరీ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రం 1971లో జరిగిన భారత్, పాక్ యుద్దం నేపథ్యంతో తెరకెక్కింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాచు. ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది.. మెహబ్బత్ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్..’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో పూరి మార్క్ స్పష్టంగా కనిపిచింది. ఆకాశ్ నటనలో వైవిధ్యం కనిపిస్తోంది. అద్బుతమైన సన్నివేశాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా చిత్రికరించారు. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఇప్పటి వరకు మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ కూడా  ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి కలిగించాయి. లవ్ వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చెబుతున్నారు.