పాలమూరు మెడికల్ కాలేజీకి నాంది - MicTv.in - Telugu News
mictv telugu

పాలమూరు మెడికల్ కాలేజీకి నాంది

December 4, 2017

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో విస్తృతంగా  పర్యటించారు. ఈ సందర్బంగా దివిటిపల్లి‌లో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆనంతరం జిల్లా కేంద్రంలోని  బైపాస్ రోడ్డు, కొత్త కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ,ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మయూరి పార్క్ లో బాతుకొలను, పక్షి పంజరం, జిప్ సైకిల్, ఆర్చరీ, రైఫిల్ షూట్, జిమ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

మెడికల్ కళాశాల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..  పాలమూరు జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం సంతోషంగా ఉందన్నారు.లక్ష్మారెడ్డి  కేసీఆర్ వెంటపడి మరీ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నారని అన్నారు. లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ… పాలమూరుకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి , శంకుస్థాపన చేసిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలని తెలిపారు. 2016-2017 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు.

తాజాగా 2017-18 ఏడాదికి కూడా అడ్మిషన్లు తీసుకోనున్నారని తెలిపారు. ఏడాది 150 మంది నుంచి 300 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు, మెడికల్ కాలేజీకి అనుబంధంగా జిల్లా కేంద్ర ప్రాంతీయ వైద్య కళాశాలను జిల్లా వైద్యశాలగా మార్చమని చెప్పారు.ప్రస్తుతం  ప్రభుత్వం సాధారణ వైద్యశాలలుగా మెడికల్ కాలేజీకి అనుసంధానం చేసి తరగతుల హస్పిటల్‌గా మార్చామని తెలిపారు.