ఉపాధ్యాయురాలిపై భర్త హత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

ఉపాధ్యాయురాలిపై భర్త హత్యాయత్నం

April 11, 2018

కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు. మద్యానికి బానిసై  భార్యను ఆరుసార్లు పొడిచాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబ్ నగర్  జిల్లా దాదాన్ పల్లికి చెందిన కన్యాకుమారికి కర్నూల్ జిల్లాకు చెందిన రమణారెడ్డితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారి ముస్లాయిపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రమణారెడ్డి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.తాగుడుకు బానిస అయి భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవులు జరుగుతున్న క్రమంలో ఈ రోజు ఉదయం మద్యం సేవించిన రమణారెడ్డి, కన్యాకుమారి పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేసి ఆరుసార్లు పొడిచాడు. ఆ తర్వాత  అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పాఠశాల సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.