తెలంగాణలో లక్షమందితో మహానాడట..పల్లె పల్లెకు టీడీపీ అట! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో లక్షమందితో మహానాడట..పల్లె పల్లెకు టీడీపీ అట!

March 1, 2018

బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో  సీఎం చంద్రబాబు కార్యకర్తలతో  సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశా నిర్థేశం చేశారు. మూడు బహిరంగ సభలతో  ఈ ఏడాది మహానాడు నిర్హహిస్తామని  పలువురు నేతలు చెప్పడంతో చంద్రబాబు దానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వీలైనంత తొందరలో తెలంగాణలో లక్షమందితో మహానాడును నిర్వహించాలని ఆయన చెప్పారు. పార్టీ శ్రేణుల భవిష్యత్తుపై  భరోసా తీసుకునే పూర్తి బాధ్యత రాష్ట్రంలో ఉన్న నాయకులదే  అని చంద్రబాబు అన్నారు. పక్కా ప్రణాళికలు వేసుకుని కార్యక్రమాలను నిర్వహించండని  నేతలకు చంద్రబాబు వివరించారు. ‘కార్యకర్తలలో ఆత్మ విశ్వాసం నింపండి. పల్లె పల్లెకు టీటీడీపీ కార్యక్రమం నిర్వహించండి.  తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటాను’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.