‘మహానటి’కి  రూ.  4.5 కోట్లు… - MicTv.in - Telugu News
mictv telugu

‘మహానటి’కి  రూ.  4.5 కోట్లు…

August 29, 2017

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహానటి‘. ఈ మూవీ “ఎవడే సుబ్రమణ్యం” ఫేం నాగ్ ఆశ్విన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా,  మలయాల  యువ హీరో దుల్కర్ సల్మాన్  జెమిని  గణేషన్ పాత్రలో నటిస్తున్నాడు.

సమంత  జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. దాంతో మూవీపై భారి హైప్ క్రియేట్ అయింది. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాల భాషల్లో రీలిజ్ కానుంది.

ఈ సినిమా ప్రస్తుతం  షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీకి అప్పుడే బిజినెస్ కూడా మొదలుపెట్టింది.  ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను భారీ మెుత్తానికి ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకుంది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుంగానే 4.5 కోట్ల కు నిర్వాణ  సినిమాస్  సొంతం చేసుకుంది. ఈ సినిమాను స్వప్నాదత్..  అశ్వినిదత్ బ్యానర్ పై నిర్మిస్తోంది.