మహానటిలో ‘అర్జున్ రెడ్డి’ శాలిని - MicTv.in - Telugu News
mictv telugu

మహానటిలో ‘అర్జున్ రెడ్డి’ శాలిని

September 11, 2017

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం ‘మహానటి’. ఈ మూవీలో కీర్తీ సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుండగా, సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు తాజాగా సావిత్రి స్నేహితురాలు, ప్రముఖ నటి జమున పాత్రకు ‘అర్జున్ రెడ్డి’  హీరోయిన్ షాలినిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమెకు ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం  ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ ఆశ్విన్  కథతో పాటు పాత్ర తీరుతెన్నులను వివరించాడు.  ఇక శాలిని సంతకం చేయడమే ఆలస్యం అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులో జెమిని గణేశన్ గా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా, మరో ముఖ్యపాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ మూవీని అశ్వినీ దత్ బ్యానర్ లో స్వప్నా దత్ నిర్మిస్తోంది.