సావిత్రిలా నటించడం అంత ఈజీ కాదు..! - MicTv.in - Telugu News
mictv telugu

సావిత్రిలా నటించడం అంత ఈజీ కాదు..!

November 29, 2017

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషిస్తోంది.  సినిమా చిత్రీకరణ  ఇప్పటికే చాలావరకు పూర్తిచేసుకుంది. తాజాగా   కీర్తి మాట్లాడుతూ…. ‘ సావిత్రిగారిలా నటించడం చాలా కష్టం . ఆమెలా నటించడం ఓ సాహసమని  నాకు అర్థంమైంది.. 10 సెకన్లలో 100 రకాల హవబావాలను  ప్రదర్శించగల ప్రతిభ  ఉన్న నటి సావిత్రి.. ఆమెలా నటించడం నాకు సవాలుగా అనిపించింది ’ అని  చెప్పింది.

వయస్సును బట్టి సావిత్రి మారుతూ వచ్చిందని, తానూ అలానే నటించవలసి వచ్చిందని పేర్కొంది.  ‘ఈ విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు.  ముఖ్యంగా ఈ సినిమాలో నేను దాదాపు 100 రకాల దుస్తుల్లో కనిపించనుడం ఓ విశేషం’ అని  చెప్పింది. ఈ సినిమాలో ఇతర పాత్రల్లో మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్ సమంత, విజయ్ దేవరకొండ, షాలీనిపాండే నటిస్తున్నారు.