జమునకు కీర్తిసురేశ్ ఘాటు కౌంటర్.. నాకు ‘మహానటి’ అర్హత ఉంది.. - MicTv.in - Telugu News
mictv telugu

జమునకు కీర్తిసురేశ్ ఘాటు కౌంటర్.. నాకు ‘మహానటి’ అర్హత ఉంది..

February 28, 2018

అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రలో నటిస్తున్న నటి కీర్తిసురేశ్‌పై ప్రముఖ నటి జమున సంచలన వ్యాఖ్యలు చేసింది. సావిత్రి పాత్రలో నటించే అర్హత కీర్తిసురేశ్‌కు లేదని విమర్శించింది. ఈ విషయంపై ఆలస్యంగా స్పందించిన కీర్తిసురేశ్.. సావిత్రి పాత్రలో తనకు నటించే అర్హత ఉందని స్పష్టం చేసింది. జమున..  సినిమా విడుదలైన తర్వాత చూసి మాట్లాడితే బాగుంటుందని చెప్పింది.  ‘నేను అన్నీ ఆలోచించే సావిత్రిగా నటించడానికి అంగీకరించాను. సావిత్రి  చాలా క్షణంగా తెలుసుకున్నాను.  తర్వాతనే నటించడానికి ఒకే చెప్పాను.. అందుకోసం చాలా శిక్షణ పొందాను. సావిత్రికి సంబంధించిన పుస్తకాలను చదివాను. ఆమె కూతురు ఛాముండేశ్వరికి కలసి సావిత్రి మేనరిజం గురించి  అడిగి తెలుసుకున్నాను. సావిత్రి చిత్రాలను లెక్కలేనన్ని చూశాను. దర్శకనిర్మాతలకు భరోసా కలిగాకే సినిమాకు ఒప్పుకున్నా..’ అని చెప్పింది. సావిత్రికి తనకు చాలా విషయాల్లో సారూప్య ఉందని చెప్పింది. సావిత్రికి క్రికెట్‌ ఇష్టం, స్మిమ్మింగ్, డ్రైవింగ్‌ అన్నా చాలా ఆసక్తి  అని, తనకూ అవే ఇష్టమని కీర్తి చెప్పింది.