అంబానీ, సచిన్ ఏ పాలు తాగుతారో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

అంబానీ, సచిన్ ఏ పాలు తాగుతారో తెలుసా?

March 27, 2018

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాజీ క్రికెటర్ సచిన్, కుబేరుడు ముఖేష్ అంబానీ మనలాంటి రక్తమాంసాల మనుషులు. కాకపోతే సెలబ్రిటీలు కావడం వల్ల ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా ఉంటుంది. తినే తిండి, కట్టే గుడ్డ, పడుకునే పడక,  తాగే పాలు.. అంటూ ఖరీదైనవే ఉంటాయి. వాళ్లు తాగే పాల ముచ్చట సోషల్ మీడియాలో వైరలైంది. వారు మామూలు పాలు తాగరని, ప్రత్యేకమైన ఆవుల క్షీరాన్నే గ్రోలుతారని తెలిసింది. ఈ ఆవులు మామూలు ఆవులు కావు. కేవలం మినరల్ వాటర్ మాత్రమే తాగే ఆవులు.

మహారాష్ట్రలోని పుణేలో ఉన్న భాగ్యలక్ష్మి డెయిరీ వీటిని పోషిస్తోంది. దీని అధిపతి దేవేంద్ర షా. ముంబైలోని సెలబ్రిటీలందరూ ఈయన కస్టమర్లే. దేవేంద్ర మొత్తం 22వేల మందికి పాలు పోస్తాడు. రోజుకు 25వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. దీని గోవులకు మంచి పోషకాహారం అందిస్తుంటాడు. పాలు తీయడం నుంచి ప్యాకింగ్ వరకు అన్ని పనులూ ఆటోమేటిగ్గా సాగుతుంటాయి. మరి ఇంత స్పెషల్ మిల్క్ ఖరీదు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. లీటరు రూ. 90 పలుకుతున్నాయి. మామూలు నీళ్లుతాగే ఆవుల పాల ధర రూ.50 నుంచి రూ. 60 లోపు ఉంది.