అనాథలకు 1 శాతం రిజర్వేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

అనాథలకు 1 శాతం రిజర్వేషన్

April 3, 2018

మహారాష్ట్ర ప్రభుత్వం అనాథలను కరుణించింది. తొలిసారిగా విద్య, ఉద్యోగాల్లో వారికి 1శాతం రిజర్వేషన్ కల్ఫించనుంది. జనవరిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకోగా తాజాగా దాన్ని చట్టంగా మార్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలోనూ అనాథకు  ప్రాధాన్యమివ్వనున్నారు.అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు ఇందుకు అర్హులు. వీరు తమకు తల్లిదండ్రులతోపాటు బంధువులెవరూ లేరని, తమ కులం గురించి తమకేమీ తెలియదని ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ ఉన్న వారే రిజర్వేషన్ పొందడానికి అర్హులని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేవలం ఆహారం, వసతి వంటివి మాత్రమే కాకుండా అనాథలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికే కోటా తీసుకొచ్చామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ అనాథాశ్రమాల్లో 3900 మంది పిల్లలు ఉననారు. ప్రైవేటు అనాథాశ్రమాల్లో ఉన్న వారి లెక్కలు ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేవు.