మహారాష్ట్ర రైతుల బాటలో లక్నో రైతులు.. - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర రైతుల బాటలో లక్నో రైతులు..

March 14, 2018

మహారాష్ట్రలో రైతులు చేసిన మహా ర్యాలీ  దేశంలో ఉన్న రైతులపై ప్రభావం చూపుతోంది. వాళ్లు చేసిన ఉద్యమ స్పూర్తితో ఉత్తరప్రదేశ్ లోని రైతులు కదం తొక్కనున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మార్చి 15న లక్నోలో నిరసనలు చేయబోతున్నారు. ‘కిసాన్‌ ప్రతిరోధ్‌ ర్యాలీ’ పేరిట ఉత్తర ప్రదేశ్ లో ఉన్న రైతులందరు లక్నో చేరుకుని తమ గోడు ప్రభుత్వానికి తెలిసేలా చేయనున్నారు. పంటలకు కనీస మద్దతు ధరకు భరోసా కల్పించాలని, రైతుల రుణాలను రద్దుచేయాలని విద్యుత్‌ చార్జీలను తగ్గించాలనీ, విద్యుత్తు ప్రయివేటీకరణ ఆపాలని తదితర డిమాండ్లతో వారు ఉద్యమబాట పడుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లో 2016 తర్వాత విద్యుత్‌ చార్జీలు,సాగునీటి ఖర్చులూ భారీగా పెరిగాయి. రైతుల కష్టాలు పట్టించుకోవడం కాదు కదా కనీస మద్దతు ధర కల్పనకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రుణ మాఫీ చేస్తామని చెప్పి అది ఏదో అరకొరగా చేశారు. అందుకోసమే సమస్యలను తీర్చాలని అక్కడి రైతులందరూ  నిరసలనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే మహారాష్ట్ర రైతుల ఉద్యమ స్పూర్తి దేశంలో ఉన్న ప్రతీ రైతులో దృడ సంకల్పాన్ని నింపుతోందని అర్థమవుతోంది. ఏది ఏమైతేనేం ఇలాగైనా ప్రభుత్వాలు రైతుల గోడును అర్థం చేసుకుంటే అదే పదివేలు.