రైతులకు ముంబై వాసుల అండ ! - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు ముంబై వాసుల అండ !

March 12, 2018

అన్నదాతలకు  అండగా ముంబై వాసులు నిలిచారు. కాలినడన 180 కిలోమీటర్ల ప్రయాణించి  రైతులు సోమవారం మద్యాహ్నం 2:30 గంటలకు మండుటెండలో నడుస్తూ ముంబై చేరుకున్నారు.వారికి ముంబై వాసులు ఘన స్వాగతం పలికారు. రైతులు ముంబై చేరుకోగానే మంచినీటి ప్యాకెట్లు,ఆహరపదార్థాలు అందించారు.  రుణమాఫితో పాటు మరికొన్ని డిమాండ్లుతో, మహారాష్ట్ర నాసిక్ నుంచి దాదాపు 50వేల మంది రైతులు ముంబై అంసెబ్లీ ముట్టడికి బయలుదేరిన సంగతి తెలిసిందే.కొన్ని  స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఆహార పదార్థాలను  పంపిణి చేశారు. నగరంలోని కొన్ని జంక్షన్ల వద్ద రైతులకు  బిస్కెట్‌ ప్యాకెట్లు పంచారు. దాదాపు పదివేల మంచినీటి బాటిళ్లతో రైతుల దూప కూడా తీర్చారు.  రాజకీయ పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు కూడా రైతులకు కూడళ్ల వద్ద నీళ్లు, స్నాక్స్‌ పంచారు. యాత్రలో పాల్గొన్న రైతుల చేతులల్లో ఎరుపు జెండాలతో ముంబై రోడ్డుంతా ఎరుపు మయం అయింది. సోమవారం ఉదయం ర్యాలీగా విధానసభకు వెళ్తే ముంబయిలో ట్రాఫిక్‌కు, పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పడంతో వారు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు ఆదివారం అర్థరాత్రే ర్యాలీగా ఆజాద్‌ మైదానానికి  చేరుకున్నారు. రైతుల కోసం మొబైల్‌ టాయిలెట్లు, నీటి ట్యాంకర్లు, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. ముంబయి మహానగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించమని, సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు కూడా తమ వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి గిరీష్‌ మహాజన్‌ రైతు నేతలతో చర్చించి ముఖ్యమంత్రితో సమావేశానికి ఆహ్వానించారు. యాత్రకు నేతృత్వం వహించిన 12 మంది సభ్యులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి  రైతుల సమస్యల గురించి చర్చించానున్నారు.