మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి. రైతుల ఆవేదన... - MicTv.in - Telugu News
mictv telugu

మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి. రైతుల ఆవేదన…

March 26, 2018

రైతులు  తమకు కారుణ్య మరణాన్ని అనుమతించాలని గవర్నర్,సబ్ డివిజనల్  మేజిస్ట్రేట్‌లకు విన్నవించారు. మహారాష్ట్ర రైతులు తమ పంటలకు మద్దతు ధర కల్ఫించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు  మెరపెట్టుకున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోలూదు. దాంతో బుల్దానా జిల్లాకు చెందిన 91 మంది కారుణ్య మరణాన్నికి ఆర్జి పెట్టుకున్నారు.తమ పంటలకు సరైన  ధర లేదని, జాతీయ రహదారి కోసం ప్రభుత్వం తమ భూములను సేకరించి రైతులకు పరిహారం చేల్లించలేదని లేఖలో రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.దాంతో తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేనందున తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు.ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులు  వారు కోరితే కారుణ్య మరణాన్ని అనుమతించ్చవచ్చి ఇటీవల సుప్రీంకోర్టు పేర్కోన్న  సంగతి తెలిసిందే. అయితే రైతుల దీనస్థితికి వారి లేఖలు అద్దం పడుతున్నాయని, చనిపోయేందుకు వారు అనుమతి కోరుతున్నారంటే సమస్య ఎంత  తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ, విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్ర రైతులు ఇటీవల ముంబయి వరకూ మహాప్రదర్శన చేపట్టారు. రైతుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.