సుత్తి దెబ్బల వైద్యం... - MicTv.in - Telugu News
mictv telugu

సుత్తి దెబ్బల వైద్యం…

August 26, 2017

నడుము నొప్పి వస్తే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరకు వెళ్తాం.. డాక్టర్ సూచించినట్టు మందులు వేసుకుంటాం. ఎక్సర్ సైజ్ లు గట్రా చేస్తాం. ఇంగ్లిష్ మందులపై నమ్మకం లేని వాళ్లు ఆయర్వేద మందులో, యునాని మందులో వాడుతారు.

కానీ అవేమీ వొద్దు.. సుత్తి దెబ్బలు చాలు అంటున్నాడు ఓ బాబా. మహారాష్ట్రకు చెందిన ఈ బాబా.. తన వద్దకు వైద్యం కోసం వచ్చే వెన్నునొప్పి  బాధితులకు ఎలా సుత్తి దెబ్బల వైద్యం చేస్తున్నాడో మీరే ఈ వీడియోలో చూడండి.

మెడ నుంచి నడుం వరకు ఇలా మొద్దు ఉలిపై సుత్తితో బాదితే నొప్పులు అప్పటికప్పుడే తగ్గిపోతాయని బాబా చెబుతున్నాడు. ఒకరికో ఇద్దరికో ఈ వైద్యం పనిచేసిందేమో.. జనం తండోపతండాలుగా దెబ్బల కోసం బారులు తీరుతున్నారు.

అయితే ఈ సుత్తి దెబ్బలు ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా. తగలరాని చోట తగిలితే నొప్పుల సంగతేమోకాని ప్రాణాలే పోతాయని అంటున్నారు. ఇలా బాదితే భవిష్యత్తులో వెన్నుపూసపై దుష్ప్రభావం ఉంటుందని, ప్రభుత్వం ఇలాంటి బాదుళ్ల బాబాలపై చర్యలు తీసుకోవాలని  డా. సత్యశీల్ కోరారు.