3 లక్షల ఎలుకలను చంపారు.. శాసనసభలో చర్చ... - MicTv.in - Telugu News
mictv telugu

3 లక్షల ఎలుకలను చంపారు.. శాసనసభలో చర్చ…

March 24, 2018

మంత్రాలయలో ఎలుకలను చంపిన విషయమై చర్చ జరుగుతోంది. దాదాపుగా 3లక్షల ఎలుకలను చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదంపై బిజెపి మంత్రి రామ్ కదం  వివరణను ఇచ్చారు. 3,19,400 అనే సంఖ్య మాత్రలకు సంబంధించినది, ఎలుకలను చంపింది కాదని తెలిపారు. 3,19,400 అనేది ఎలుకలు చంపే టాబెట్ల సంఖ్యేనని ఆయన చెప్పారు. ఎలుకలను లెక్కించడానికి యంత్రమేదీ లేదని కూడా చెప్పారు. రోజుకు 45 వేల ఎలుకలను చంపుతున్నారనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు

ఎలుకలను చంపే ఆ మాత్రలను 2010-11 కొన్నట్లు తెలిపారు. మంత్రాలయలో ఎలుకలను చంపడానికి ఇచ్చిన కాంట్రాక్టుపై విచారణ జరిపించాలని సీనియర్ బిజెపి నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌‌నాథ్ ఖడ్సే డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడు రోజుల్లో 3,19,400 ఎలుకలను కంపెనీ ఎలా చంపగలిగిందని ఆయన శాసనసభలో అడిగారు. మంత్రాలయలో 3,19,400 ఎలుకలున్నాయని సర్వేలో తేలిందని, సాధారణ పరిపాలన శాఖ వర్క్ ఆర్డర్ జారీ చేసిందని, కంపెనీకి ఆరు నెలల సమయం ఇచ్చారని, అయితే ఏడు రోజుల్లో ఆ ఎలుకలను చంపినట్లు తెలిపిందని ఆయన చెప్పారు.