అహింస,మానవసేవనే ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్య్రాన్ని సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ చనిపోయి నేటికి 63 సంవత్సరాలు అవుతోంది. ఈసందర్భంగా దేశంలోని రాజకీయనాయకులు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పించారు. జాతిపిత వర్థంతి సందర్బంగా రెండు నిమిషాలు ప్రజలందరు మౌనం పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
అందుకు ప్రజలు కూడా సహకరించి రెండు నిమిషాలు స్వచ్చందంగా సహకరించారు. దాంతో జంట నగరాలు ఎక్కడిక్కడే రెండు నిమిషాలు నిలిచిపోయాయి మంగళవారం(జనవరి30) ఉదయం 11 నుంచి 2 నిమిషాలు ప్రజలు మౌనం పాటించారు. ఆ రెండు నిమిషాల సమయంలో రహదార్లపై వాహనాల రాకపోకలను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.
అందుకు వాహనాదారులు కూడా తమ హార్లను మోగించకుండా సహకరించారు. పాదాచారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మౌనం పాటించారు . మరికొన్ని చోట్ల విద్యార్థులు,ఉద్యోగులు,కార్మికులు చిరు వ్యాపారులతో పాటుగా అన్ని వర్గాల వారు మౌనం పాటించారు. స్వాతంత్రంకోసం బలిదానం చేసిన వారిని స్మరించుకుంటూ వారి వర్థంతి,జయంతి రోజున మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.