ధోని, దీపిక వైరల్ డ్యాన్స్... - MicTv.in - Telugu News
mictv telugu

ధోని, దీపిక వైరల్ డ్యాన్స్…

April 9, 2018

క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ ప్రీత్, బ్రావోలతో  కలిసి బాలీవుడ్ నటీ దీపిక పదుకునె కాలు కదిపింది. ఐపీఎల్ కోసం రూపొందించిన పాటలో ఈ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోలో క్రికెటర్లు ఎంతో హుషారుగా స్టెప్స్ వేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీపికా బాలీవుడ్‌లోకి అడుగెట్టిన కొత్తలో ధోనితో సన్నిహితంగా ఉండేదన్న వదంతులున్నాయి. వారిద్దరూ కొన్నాళ్లు డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం సాగింది. ధోని ప్రస్తుతం సాక్షిని పెళ్లి చేసుకుని, జివా అనే కుమార్తెతో సంతోషంగా ఉన్నాడు. దీపికా రణ్‌వీర్‌సింగ్‌ను పెళ్లాడబోతోందని వార్తలొస్తున్నాయి. మరోవైపు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్‌లో దీపికా నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.