మహేష్ నాకన్నా ఎందులో ఎక్కువ?.. అల్లు అర్జున్ - MicTv.in - Telugu News
mictv telugu

మహేష్ నాకన్నా ఎందులో ఎక్కువ?.. అల్లు అర్జున్

February 21, 2018

ఇంతవరకు మనం హీరోయిన్ల మధ్యే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని విన్నాం. కానీ హీరోల మధ్య కూడా ఇలాంటివి వుంటాయని ఇది వింటే మీరు నిజమేనంటారు. ఎంత హీరోల మధ్య పోటీ వున్న బాహాటంగా చెప్పుకున్న దాఖలాలు లేవు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను ’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య ’ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నట్టు డేట్లు కూడా ఫిక్స్ చేశారు. రెండు సినిమాలు ఒకేరోజు విడుదలైతే కలెక్షన్ల పరంగా తేడా కొడుతుందని కొంత మంది పెద్ద మనుషులు వీటిని కాస్త అటూఇటుగా విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఓ వారం గ్యాప్ తీసుకుంటే మంచిదనే ప్రతిపాదన చేశారట.మహేష్ సినిమా కోసం అల్లు అర్జున్ దారి వదలాలని చెప్పారట. ఈ విషయమై అల్లు అర్జున్ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డంత పని చేశాడట. ‘మహేష్ సినిమా కోసం నా సినిమాను చచ్చినా వాయిదా వేసుకోను. అవసరమైతే నా సినిమా కోసమే మహేష్ సినిమానే వాయిదా వేసుకొమ్మని చెప్పండి. అయినా మహేష్ నాకన్నా ఎందులో ఎక్కువ ? నేను మహేష్‌‌తో సమానమైన స్టార్ హీరోని ’ అని కుతకుతా ఉడికిపోయాడని ఫిల్మ్‌నగర్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. చివరికి మధ్యవర్తులు అల్లు అర్జున్‌ని బుజ్జగించి బామాలి మహేష్ సినిమాను ముందు, అతని సినిమాను వారం వెనక్కు విడుదలయ్యేలా ఒప్పించినట్టు సమాచారం.