ఈ చిత్రం మహేశ్ బాబుకు ప్రత్యేకం.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చిత్రం మహేశ్ బాబుకు ప్రత్యేకం.. ఎందుకంటే

April 20, 2018

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’  సినిమా నేడు భారీ అంచనాలతో విడుదల అయింది. ఈ రోజు మహేశ్‌కు ప్రత్యేకమైన రోజు. అది ఏంటంటే ఆయన తల్లి ఇందిరాదేవి పుట్టినరోజు కావడం. ఈ విషయాన్ని మహేశ్ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని,ఎందుకంటే తన తల్లి జన్మదినం రోజున విడుదల అవుతుందని పేర్కొన్నాడు. తాజగా మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి యువతిగా  ఉన్నప్పటి అపురూపమైన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే అమ్మా అంటూ కామెంట్ పెట్టాడు.మహేష్ తల్లి ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.