mictv telugu

నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. నమ్రత

February 10, 2019

మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టారో.. అంతే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా. షూటింగ్ తరువాత కొంచెం ఖాళీ సమయం దొరికినా చాలు భార్య నమ్రత.. పిల్లలు గౌతమ్, సితారలతో సమయం గడిపేందుకు విదేశాలకు వెళతారు. ఇంత అన్యోన్యంగా ఉండే మహేష్-నమ్రతలు ప్రేమ వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. నేటితో వారి ప్రేమవివాహానికి 14 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Telugu News Mahesh Babu's Instagram Post For Wife Namrata Shirodkar On Wedding Anniversary Is Pure Love.

తమమధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో బెబుతూ ‘వంశీ’ షూటింగ్ సమయంలో షూటింగ్ కోసం న్యూజీల్యాండ్ వెళ్లామని.. ఆ సమయంలో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. కానీ అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసరికి ఇద్దరం ప్రేమలో ఉన్నామని అర్థం అయిందని చెప్పారు. “నేనే ముందు మహేష్‌కు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాను. అప్పటికే మహేష్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి గురించి మరొకరికి అవగాహన ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాం” అంటూ తెలిపారు. పెళ్లి తర్వాత నటించడం తనకే ఇష్టంలేక నటించలేదని వెల్లడించారు. నటన టేకప్ చేస్తే కెరీర్‌కు కుటుంబానికి న్యాయం చేయలేనని అనుకున్నాను అందుకే నటనకు స్వస్తి చెప్పానని వివరించారు. అందుకే అప్పటికి కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు. భర్తగా మహేష్‌కు 10 కి 10 మార్కులు వేస్తానని.. అదే నటుడిగా 10 కి 20 మార్కులు వేస్తానని తెలిపారు. బయట చాలామంది మహేష్ ప్రతి నిర్ణయం వెనక నమ్రత ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఈ విషయంపై స్పందిస్తూ “మహేష్ తీసుకునే నిర్ణయాల్లో నా జోక్యం ఉండదు. తనే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. బయట జరుగుతున్న ప్రచారం అబద్దం” అని స్పష్టం చేశారు.Telugu News Mahesh Babu’s Instagram Post For Wife Namrata Shirodkar On Wedding Anniversary Is Pure Love