సందీప్ రెడ్డి డైరెక్షన్‌‌లో మెకానిక్‌‌గా మహేశ్... - MicTv.in - Telugu News
mictv telugu

సందీప్ రెడ్డి డైరెక్షన్‌‌లో మెకానిక్‌‌గా మహేశ్…

April 3, 2018

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా .  మొదటి ప్రయత్నంతోనే యూత్‌ను బాగా ఆకర్షించి ,విజయం సాధించాడు. తాజాగా మహేశ్ బాబు‌తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడని సమాచారం. సందీప్ ఇప్పటీకే మహేశ్‌ను కలిసి కథ వినించాడని తెలుస్తోంది. ఆ కథ మహేశ్‌కు బాగ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.ఈ సినిమాలో మహేశ్ మోకానిక్‌గా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటుగా, యూత్‌ను కూడా ఆకర్షించే విధంగా సందీప్ రాశాడని సినీ వర్గాల సమాచారం. మహేశ్  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ భరత్ అను నేను ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.