ఏప్రిల్ 27న భరత్ అను నేను - MicTv.in - Telugu News
mictv telugu

ఏప్రిల్ 27న భరత్ అను నేను

October 26, 2017

సూపర్ స్టార్ మహేశ్ బాబు  ‘స్పైడర్ ’సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం‘ భరత్ అను నేను’. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబందించిన చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది.

నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 27 న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో మహేశ్‌కు  జోడిగా కైరా ఆద్వాని నటిస్తోం ది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు ’చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రం కూడా తప్పకుండా విజయ్ సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.