మహేశ్ మేనల్లుడు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ మేనల్లుడు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు..

March 23, 2018

తెలుగు తెరకు మరో నట వారసుడు పరిచయం అవుతున్నాడు. అతని పేరు అశోక్ గల్లా. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి ఈ యువహీరో పరిచయం కాబోతున్నాడు. అతను స్వయానా మహేష్ బాబుకు మేనల్లుడు కావటం విశేషం. తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ గల్లా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇతను గతంలో సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ ’ చిత్రానికి దర్శకుడు. 2004 లో వచ్చిన ‘నాని’ సినిమాలో అశోక్ గల్లా బాలనటుడిగా నటించడం గమనార్హం. అన్నీ కుదిరితే మే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుందని ఫిల్మ్‌నగర్ టాక్.