mictv telugu

అమ్మో నా పాస్‌పోర్ట్ మనవడికి దొరక్కుండా పెట్టాలి.. ఆనంద్ మహీంద్రా

February 13, 2019

మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తుంటారు. అంతేకాదు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గతంలో చైనాకు చెందిన ఓ చిన్నారి తన తండ్రి పాస్‌పోర్ట్‌పై  పిచ్చి గీతలు గీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు అప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పని చేసినందుకు చిన్నారి కూడా తన తండ్రికి సారీ చెబుతున్నట్లు ఉన్న ఫోటో కూడా చక్కర్లు కొట్టింది.

తాజాగా ఆ ఆనంద్ మహీంద్రా మళ్లీ గుర్తు చేశారు. పిల్లాడు పిచ్చి గీతలు గీసిన పాస్ పోర్టును ఆయన ట్విటర్‌లో షేర్ చేస్తూ ‘నా మనవడికి నా పాస్‌పోర్టును అందకుండా పెట్టాలి. లేకపోతే నా పాస్‌పోర్టుకు కూడా ఇదే గతి పడుతుందేమో.. నా మనవడు ఆ పిల్లాడిలా క్ష‌మాప‌ణ‌లు చెప్పడు’ అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన నెటిజన్లు కూడా ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.

Telugu News Mahindra Company Anand Mahindra Tweet About His Passport