ఆరు నెలలు ముఖానికి రంగు పూసుకోను.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆరు నెలలు ముఖానికి రంగు పూసుకోను..

February 19, 2018

తాను నటించిన సినిమా ఇంకా విడుదల కానేలేదు.. అప్పుడే ప్రియా ప్రకాశ్ వారియర్‌కు అవకాశాలు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. బాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థలు ప్రియాను సంప్రదిస్తున్నాయి. కాగా ప్రియ వాటిని చల్లగా తిరస్కరిస్తోంది. ఆగస్ట్ వరకు ఏ సినిమాలోనూ నటించనని ఖరాఖండిగా చెప్పేస్తోంది. ఆగస్ట్‌లో ప్రియ నటించిన ‘ ఒరు ఆదార్ లవ్ ’ సినిమా విడుదల అవుతోంది.

మీడియా ముందుకు వచ్చిన ప్రియ తనెందుకు సినిమా అవకాశాలను కాదనుకుంటోందో చెప్పింది.    ‘ నా సినిమా విడుదల కాక ముందే, చిన్న టీజర్‌లో నా హావాభావాలు నచ్చి నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. తొలుత ఈ సినిమాలో చిన్న పాత్ర కోసమే దర్శకుడు నన్ను ఎంచుకున్నాడు. కానీ నాకొచ్చిన పాప్యులారిటీతో నా పాత్ర పరిధిని పెంచారు. నేను బాగా నటించానని అంటున్నారు.. ఆ క్రెడిట్ నాది కాదు, దర్శకుడిదే. ఒమర్ లులు చెప్పినట్టు నేను చేశాను. ఈ సినిమాకు పని చేస్తున్న సాంకేతికి నిపుణులందరికీ నేను రుణపడి వుంటాను.

నాకు నటన కాదు కదా దానిలోని ఓనమాలు కూడా రావు. ఏదో దర్శకుడు చెప్పింది చేసుకుపోయా. దానికి మీరింతగా ఆదరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. కొత్త వ్య‌క్తుల‌కు ఇంత ప్రోత్సాహం రావ‌డం ఆనందంగా ఉంది. ప‌లు భాష‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి నాకు బోల్డ‌న్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే ఆగ‌స్ట్ వ‌ర‌కు నేను ఏ ఇత‌ర సినిమాలోనూ న‌టించ‌లేను. ఆగ‌స్ట్‌లో `ఒరు ఆదార్ ల‌వ్‌` సినిమా విడుద‌లవుతోంది. ఆ త‌ర్వాతే ఇత‌ర సినిమాల గురించి ఆలోచిస్తాను ’ అని చెప్పింది ప్రియ.

చాలా మంది దర్శక, నర్మాతలు ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా తమ సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రియ తెలుసుకుంటే బాగుంటుందని అంటున్నారు ఆమె సన్నిహితులు.