శ్రీదేవి.. మహాలక్ష్మికళతో  స్వర్గపురికి.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి.. మహాలక్ష్మికళతో  స్వర్గపురికి..

February 28, 2018

నటి శ్రీదేవికి తెలుపు రంగు అంటే ఇష్టమని భావించిన కుటుంబ సభ్యులు ఆమె అంతిమ యాత్రలో తెల్లని పూలు, తెల్లని వాహనం వాడారు. శ్రీదేవి బతికుండగా తాను చనిపోయినప్పుడు కూడా తన ముఖం మీద మేకప్ వుండాలని అనకుందట. ఆమె చివరి కోరిక నెరవేర్చే దిశలో శ్రీదేవి భౌతిక కాయానికి అందంగా మేకప్ వేశారు. కాటుక, బొట్టు పెట్టి, లిప్‌స్టిక్ సైతం పెట్టి కుందనపు బొమ్మలా తయారు చేశారు. పట్టుచీర ధరింపజేశారు. మల్లెపూలు, పసుపు, కుంకుమలతో ముత్తైదువకు చేయాల్సిన లాంఛనాలన్నీ చేశారు. మేకప్ వేశాక శ్రీదేవి పడుకుందా అన్నట్టే అనిపిస్తోంది. ముఖం ఒక్కసారిగా మహాలక్ష్మి కళ సంతరించుకుంది.శ్రీదేవి అంతిమయాత్రలో లక్షలాది అభిమానులు పాల్గొన్నారు.శ్రీదేవి పద్మశ్రీ పురస్కారం పొందటంతో ప్రభుత్వం జెండాను ఆమె భౌతిక కాయంపై కప్పి, సైనిక గౌరవ వందనం కూడా చేయించారు. ఇంకా శ్రీదేవికి ఏమేం ఇష్టాలో కుటుంబ సభ్యులు తెలుసుకుని చివరిసారిగా తీర్చటంతో ఆమె అభిమానులను కంటతడి పెట్టిస్తోంది.