మళ్ళీ పాక్‌కు వెళ్ళిన మలాలా - MicTv.in - Telugu News
mictv telugu

మళ్ళీ పాక్‌కు వెళ్ళిన మలాలా

March 29, 2018

అతిచిన్న వయసులో నోబెల్ పురస్కారం పొంది రికార్డులకెక్కిన మలాలా యూసుఫ్‌జాహి తొలిసారిగా మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళింది. పాకిస్తాన్‌కు వచ్చిన మలాలా.. ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసితో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. 2012లో మహిళా విద్య కోసం ప్రచారం చేస్తున్న మలాలాపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. ఆమె వయసు ఇప్పుడు 20 ఏళ్లు.  మలాలా రాక సున్నితమైన అంశం కాబట్టి.. ఆమె పర్యటనకు సంబంధించి అనేక అంశాలను పాక్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.