బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి?

March 1, 2018

తల్లిని మించిన దైవం, తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఏది ఉండదని అంటారు. సృష్టిలో తీయనైనది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే. మరి అలాంటి ఓ తల్లి తన కన్నబిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి? ఇప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తింది మలయాళ మ్యాగజైన్.

 ‘గృహలక్ష్మి’ కవర్ పేజ్ పై  మోడల్ గిలు జోసెఫ్ బిడ్డకు బహిరంగంగా పాలిచ్చే ఫోటోతో సదరు మ్యాగజైన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. కన్నతల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఏదో తప్పు చేస్తున్నట్లు చీర కొంగు కప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

మ్యాగజైన్ కవర్ పై ఉన్న మోడల్ కూడా స్పందిస్తూ ‘కన్నతల్లి తన బిడ్డకు పాలివ్వడం గౌరవప్రదమైన పని, దానికి భయపడాల్సిన అవసరం లేదు’ అని తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే మ్యాగజైన్  నిర్వహించిన క్యాంపెయిన్ లో దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాగజైన్ కవర్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.