ప్రతినాయకుడి పాత్రలో సిద్దార్థ్... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతినాయకుడి పాత్రలో సిద్దార్థ్…

April 12, 2018

హీరో సిద్దార్థ్ విలన్ పాత్రలో నటించనున్నాడు. మలయాళ నటుడు దిలీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ కమ్మార్ సంభవం’.ఈ చిత్రంలో సిద్దు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో పాత్రగా ధీటుగా విలన్ పాత్ర ఉండడంతో ఈ చిత్రంలో నటించడానికి  సిద్దు అంగీకరించాడు. తొలి మలయాళ చిత్రానికే సిద్దు తన పాత్రకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాడని తెలుస్తోంది.ఈ చిత్రానికి అంబత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం బ్రిటిష్ కాలంలో జరిగిన యద్దార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో ఆనాటి పరిస్థితులు కనిపించేలా సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. మరి మలయాళ చిత్ర సీమలో తొలి చిత్రం చేస్తున్న సిద్దుకు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి మరి.
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్ ’సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు సిద్దు. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’‘ ఓ మై ఫ్రెండ్’  తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చాక్‌లేట్ బాయ్‌గా నిలిచాడు. ‘రంగ్ దే బసంతి’తో బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు పొందాడు. ఈ మధ్యే ఆయన నటించిన హారర్ ధ్రిల్లర్ ‘గృహం’ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించింది.