mictv telugu

ఆమె కోసం.. రాజు పదవిని వదిలేశాడు..

January 7, 2019

మాజీ మిస్ మాస్కో ఒక్సానా వోవోదినాతో పెళ్లి జరిగిందని వస్తున్న వార్తల నేపథ్యంలో మలేసియా రాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. దేశ చరిత్రలో ఒక రాజు పదవిని వదులుకోవడం ఇదే తొలిసారి. రాజు సుల్తాన్ 5వ ముహమ్మద్ ఆదివారం పదవీత్యాగం చేశారు. మలేసియా బ్రిటన్ నుంచి 1957లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రస్తుత సుల్తాన్ 15వ రాజు. 49 ఏళ్ల రాజు 25 ఏళ్ల మాజీ మిస్ మాస్కో ఒక్సానా వోవోదినాను పెళ్లాడినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.Telugu News Malaysian king’s shock resignation unlikely to affect respect for monarchy, say analystsపదవి నుంచి రాజు ఎందుకు తప్పుకున్నారు అనే అంశంపై రాజప్రాసాదం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక వివరణా రాలేదు. నేషనల్ ప్యాలెస్ ప్రకటించిన వివరాల ప్రకారం ..15వ రాజుగా ముహమ్మద్ తన పదవికి రాజీనామా సమర్పించినట్టు, ఈనెల ఆరవ తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. డిసెంబరు 2016లో రాజుగా ముహమ్మద్ సింహాసనాన్ని అధిష్ఠించారు. వైద్య చికిత్స నిమిత్తం నవంబరు నుంచి ఆయన సెలవులో ఉన్నారు.Telugu News Malaysian king’s shock resignation unlikely to affect respect for monarchy, say analysts