రూ.10తోనే మలేరియా పరీక్ష  - MicTv.in - Telugu News
mictv telugu

రూ.10తోనే మలేరియా పరీక్ష 

October 20, 2017

తక్కువ ఖర్చుతో మలేరియా వ్యాధిని గుర్తించే పరికరాన్ని కోల్‌కతా పరిశోదకులు రూపొందించారు. కేవలం రూ.10 ఖర్చుతో తయారు జేశారు. ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్  సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరికరాన్ని కనిపెట్టి అభివృద్ధి చేశారు. తక్కువ ఖర్చుతో వ్యాధిని గుర్తించవచ్చు. కొన్ని చిన్న చిన్న మార్పులతో డెంగీ వ్యాధిని కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

పరిశోధనలో భాగంగా వీరు  కాగితపు సూక్ష్మదర్శినికి మెుబైల్ కెమెరాను అనుసంధానం చేశారు.  వ్యక్తుల నుంచి సేకరించి రక్త నమూనాలకు కొన్ని రకాలను రసాయనాలను కలిపి ఫోటోను తీశారు. ఆ తర్వాత ఈ డేటాను సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం చేసి, మలేరియా కణాల ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. కాగితపు సూక్ష్మదర్శినిని ఫోల్డ్ మైక్రోస్కోప్ అని పిలుస్తారు. దీన్ని తక్కువ ఖర్చుతోనే తయారుచేయవచ్చు. ఈ పరికరం అందించే సమాచారం కూడా కచ్చితంగా ఉంటుందని అన్నారు. రిమోట్ టెస్టింగ్ సదుపాయం ద్వారా వేలి నుంచి ఒక రక్తపు చుక్కను తీసి, దీంతోనే మలేరియా వ్యాధి సోకిందా? లేదా అనే విషయాన్ని క్షణాల్లో సులువుగా తెలుసుకోవచ్చని అరిందమ్ బిశ్వాస్  తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మలేరియా కిట్ సెంట్యూర్ ధర రూ. 80. అయితే ప్రస్తుతం అభివృద్ధి చేసిన కిట్ ధర దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ. దీని వల్ల వచ్చిన ఫలితాలు 90 శాతం కచ్చితమైనవని డాక్టర్ బిశ్వాస్ తెలియజేశారు.