స్కూల్ లో దారుణం.. 25 మంది సజీవ దహనం..! - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్ లో దారుణం.. 25 మంది సజీవ దహనం..!

September 14, 2017

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో దారుణం జరిగింది.  ఓ మత భోదక పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది .ఈ ప్రమాదంలో దాదాపుగా 25 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మృతులల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున కౌలాలంపూర్ లోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో  ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని అనధికార వర్గాలు పేర్కొన్నాయి. మృతుల్లో 15 నుంచి18 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఈ సంఘటన పై ప్రధాని నజీర్ రజాక్ సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదానికి  గల కారణమేంటో ఇంకా తెలియాల్సి ఉంది.