mictv telugu

కొనసాగుతున్న దీదీ సత్యాగ్రహ ధర్నా

February 4, 2019

కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన ‘సత్యాగ్రహ’ ధర్నా అర్థరాత్రి నుంచి కొనసాగుతోంది. శారదా చిట్ ఫండ్ స్కీం కేసులో కీలక ఆధారాలను నిర్వీర్యం చేశారని ఆరోపణలు ఎదురుకుంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడం కోసం సీబీఐ అధికారులు నిన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ రాత్రికి రాత్రే దీక్షకు దిగారు.Telugu News Mamata Banerjee dharna LIVE: CBI to move SC today; WB CM to hold Cabinet meet at protest venueఆదివారం రాత్రి భోజనం నిరాకరించిన మమతా రాత్రంతా మేల్కొనే ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంతవరకు నేను ఈ సత్యాగ్రహాన్ని కొనసాగిస్తాను’ అని అన్నారు. ఈ ఉదయం భారీ సంఖ్యలో తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దీక్షా వేదిక వద్దకు చేరుకుని మమతాకు మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు మమతకు సంఘీభావం తెలిపారు. మరోవైపు తాజా పరిణామాలపై సీబీఐ అధికారులు నేడు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నరు. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసానికి నిన్న సాయంత్రం సీబీఐ అధికారులు చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పోలీసులు వెంటనే అప్రమత్తమై సీబీఐ అధికారులను కమిషనర్‌ నివాసం బయటే అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.