ప్రియురాలిని కత్తితో పొడిచాడు.. నీదేం ప్రేమరా బాడ్కవ్? - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియురాలిని కత్తితో పొడిచాడు.. నీదేం ప్రేమరా బాడ్కవ్?

February 23, 2018

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. కానీ ఇక్కడ  ఓ ప్రియుడు తన ప్రేయసి ప్రాణాలను కోరుకున్నాడు. నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కద్దు అనే కసితో కత్తితో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన లింగం..యమున  ఇద్దరు చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నారు. వారు పెరుగుతున్న కొద్దీ వారి మధ్య  ప్రేమ కూడా రెట్టింపు అయ్యింది. అయితే  ప్రేమలు గీమలు జాంతానై.. అవి మన ఇంటా వంటా లేవు అని  కూతురికి సర్దిచెప్పిన యమున తల్లిదండ్రులు..లింగంపై కేసు పెట్టారు. దీనితో పోలీసులు లింగంను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

తల్లిదండ్రుల మాట కాదనలేక యమున తన ప్రేమను చంపుకుంది. బెయిల్‌పై బయటకు వచ్చిన లింగం..నేరుగా యమున ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో యమున తప్ప ఎవ్వరూ లేరు. నాతో వస్తావా లేక చస్తావా అంటూ యమునతో వాగ్వాదానికి దిగాడు లింగం. తల్లిదండ్రులను వదిలి తాను రాలేనని చెప్పేసింది యమున. దీనితో ఆవేశంలో  విచక్షణ కోల్పోయిన లింగం.. యమునపై కత్తితో దాడి చేశాడు. యుమున అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

చుట్టుప్రక్కల వారు ఆమెను వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పరారైన లింగంను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయినా ప్రేమించిన అమ్మాయి చావు కోరుకున్నాడు వీడిదేం ప్రేమ? అంటూ స్థానికులు అతనిపై మండిపడుతున్నారు. తనను అంతగా ప్రేమించిన వ్యక్తి  తనపై ఇలా కత్తితో దాడి చేస్తాడని ఊహించలేదని  పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది యమున.  ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలే కాని ఇలా ప్రాణాల్ని కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారో నేటి ప్రేమికులు.