ఈవీడియో చూసినవారికెవ్వరికైనా ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. చిన్న పిల్లలపై ఇంత అమానుషంగా ప్రవర్తించే వీన్ని ఏం చేయాలి? రాజస్థాన్లోని మేవార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈసంఘటన జరిగింది చిన్నపిల్లల హాస్టలా? లేక కన్నతండ్రేనా అనే విషయం స్పష్టంగా లేదు. ఈవీడియో ఫేస్బుక్లో వైరల్ అయ్యింది.
ఈదారుణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఓవైపు కన్నీళ్లు పెట్టుకుంటూనే, వాడిపై కన్నెర్ర జేస్తున్నారు. పిల్లాడిని తాడుతో పైకి కట్టి, పక్కనే ఇంకో చిన్న పిల్లను కూడా దారుణంగా కొడుతూ..అబ్బ రాయడానికే మనసొప్పడంలేదు..వీనికి ఇలా కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయో.
అసలు ఈవీడియో తీస్తున్న వాళ్లకు కొంచమైనా బాధ కలగలేదా? వీడియో తీయడం పక్కన పెట్టి వాన్ని ఆపాలని అనిపించలేదా? మనిషి మనసు మరీ ఇంత కఠినంగా మారుతోందా? ఇలాంటి వాళ్లకు భూమ్మీద కాదు కాదు ఏ లోకంలో కూడా బ్రతకడానికి అర్హత లేదు. ఆ దారుణం ఏంటో మీరూ చూడండి. ఈవీడియోలో ఉన్న వాడు దొరికేంత వరకు షేర్ చేయండి.