వీడు మనిషేనా...ఇంకేమన్ననా ? - MicTv.in - Telugu News
mictv telugu

వీడు మనిషేనా…ఇంకేమన్ననా ?

September 13, 2017

రోజు రోజుకు మనుషులు ఎట్ల తయారైతున్రంటే …సాటి మనిషిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు ఏకంగా చిన్న చిన్న విషయాలకు కూడా దారుణాలు చేస్తున్నారు. పంజాబ్ లోని మాలిక్ పూర్ లో ఇలాంటి దారుణమే జరిగింది. ట్రాక్టర్ పైన ఉన్న కలర్ ను చెరితపేశాడని ఓ రాక్షసుడు  ఓ ఆరెళ్ల బాలున్ని పొట్టన పెట్టుకున్నాడు. గుర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి కి ఓ ట్రాక్టర్ ఉందట. అయితే ఆ ట్రాక్టర్ పై ఉండే కలర్ ను ఇరుగు ,పొరుగు నుండే పిల్లలు  తరచూ చెరిపేస్తున్నారట. ఎన్నిసార్లు పిల్లలకు చెప్పినా వాళ్లు వినలేదట.

దాంతో కోపం పెంచుకున్న గుర్ ప్రీత్…  సుభ్ ప్రీత్ (6) అనే పిల్లాన్ని  ఊరు అవుతలికి తీసుకెల్లి చంపేసాడు. పిల్లగాని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసు నమోదు చేసి గుర్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు చేసారు. అయినా ట్రాక్టర్ పైన గీతలు పడ్డయని  పసి పిలగాన్ని చంపుడేంది ? వాడసలు మనిషేనా ఇలాంటి వాళ్లను  క్షమించ కూడదు కఠినంగా శిక్షించాలని  ఆ ఊరి  గ్రామస్ధులు… బాలుడిని చంపిన వాని మీద అగ్గిమీద గుగ్గిలం అయితున్రట.