mictv telugu

అండర్‌వేర్‌లో 4 పిల్లిపిల్లలు పెట్టుకున్నాడు..

January 11, 2019

 సింగపూర్ ఇమిగ్రేషన్ అధికారులు నాలుగు పిల్లి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి ఒక నలబై ఐదు ఏళ్ళ వ్యక్తి సింగపూర్ దేశానికి కారులో వెళుతున్నాడు. ఆ సమయంలో సింగపూర్ సరిహద్దులో ఆ వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు ఆపి కారులో నుంచి కిందికి దింపి మొత్తం చెక్ చేశారు. ఏమి లేదని తెలుసుకున్న పోలీసులు అతడిని వెళ్ళమని చెప్పారు. అయితే సదరు వ్యక్తి సరిగ్గా కారులో కూర్చునే సమయంలో ప్యాంటులో నుంచి ‘మియావ్.. మియావ్’ అని శబ్దం వినిపించింది. దీనితో పోలీసులు ఆరా తీయగా ప్యాంటు జేబులో నుంచి నాలుగు పిల్లి పిల్లలు బయటికి తీసి ఇచ్చాడు.

Telugu News Man caught trying to smuggle 4 kittens at Malaysia-Singapore border by hiding them in his pants .

అయితే, సింగపూర్‌లోకి పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువుల తీసుకురావాలంటే అనేక నిబంధనలు ఉంటాయి. అందుకు అవసరమైన హెల్త్ సర్టిఫికెట్స్, లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. రేబిస్ వంటి వ్యాధులు ప్రబలకుండా.. సింగపూర్ ఇలాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే, ఈ పిల్లి పిల్లల్ని ఆ వ్యక్తి దొంగతనంగా సింగపూర్‌లోకి తీసుకొచ్చి అమ్మేందుకు ప్రయత్నించినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే, అతను చేసింది నేరమని తేలితే.. ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, రూ. 10000 సింగపూర్ డాలర్లు జరిమానా విధిస్తారు.

Telugu News Man caught trying to smuggle 4 kittens at Malaysia-Singapore border by hiding them in his pants