అత్తామామల వేధింపులు.. అల్లుడి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అత్తామామల వేధింపులు.. అల్లుడి ఆత్మహత్య

January 8, 2019

అత్తామామల, ఆడపడచుల పోరు తట్టుకోలేక కోడళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. కానీ, హైదరాబాద్ మల్కాజిగిరిలో అత్తమామల వేధింపులు తాళలేక ఓ అల్లుడు ప్రాణం తీసుకున్నాడు. అత్తమామల సూటి పోటి మాటలకు కలతచెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిని కఠినంగా శిక్షించాలని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ అతని జేబిలో దొరికింది.

నిజామాబాద్ జిల్లా నవీపేట లక్ష్మీ కిసాన్‌ఫారం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(27), వనస్థలిపురానికి చెందిన సౌజన్య భార్యభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. బేగంపేటలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2 నెలల కిందట భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తమ కూతురికి విడాకులు ఇవ్వాలంటూ అత్తమామలు చంద్రశేఖర్‌ను బలవంతం చేయడం మొదలుపెటారు. వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువవడంతో ఈ నెల 5న తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఆన్‌లైన్‌లో రైల్‌టికెట్లను బుక్‌చేశానని, 7న ఉదయం వరకు రావాలని చంద్రశేఖర్‌ కోరాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తమ కొడుకు ఆత్మహత్యకు అత్తమామల వేధింపులే కారణమని.. తండ్రి మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Telugu News man committed suicide to get rid of his father in law harassment