mictv telugu

పబ్‌జీ మహిమ.. పెళ్లాం, పిల్లల్ని వదిలేశాడు..   

February 13, 2019

పబ్‌జి.. స్కూలు పిల్లాడి నుంచి పెద్దల వరకు అందరూ ఆడుతూ.. బానిసలైపోతున్న గేమ్ ఇది. పబ్ జి పరేషాన్‌తో పిల్లలు చదువులు పక్కకుపెట్టి, పెద్దలు పనులు పక్కకు పెడుతున్నారు. ఈ వ్యవహారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు కూడా వెళ్లింది. తాాజాగా పబ్‌జి గురించి ఫేస్‌బుక్ ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తిని ఇంట్లో వాళ్లు పబ్ జి గేమ్ ఆడనివ్వడంలేదిని భార్యబిడ్డను, వ్యాపారాన్ని వదిలేసి ఇంట్లోంచి పారిపోయాడు. ఈ వింత ఘటన మలేషియాకు చోటు చేసుకుంది.

Telugu News Man Escaped From Home Did Not Play The Pubg Game malesiya

‘నా భర్త పబ్‌జి గేమ్‌కు బానిసయ్యాడు. మొదట్లో ఈ ఆట ఆడే ముందు బాగానే ఉండేవాడు. కానీ దానికి బానిసగా మారిపోయినప్పటినుంచి రాత్రిళ్లు నిద్రపోవడం కూడా మానేశాడు. పొద్దున్నే లేచేవాడు కాదు. తన పనులు, వ్యాపారాన్ని పట్టించుకోవడం కూడా మానేశాడు. దీంతో నేను గొడవపెట్టాను. దాంతో ఆయన తన ఆటకు నా నుంచి ఇబ్బంది కలుగుతుందని, నన్ను నా బిడ్డను వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. నేను ఇప్పుడు నాలుగు నెలల గర్భిణిని’ అంటూ ఫేస్‌బుక్‌లో తన ఆవేదన వ్యక్తం చేసింది.  

మన దేశంలో కూడా చాలామంది పబ్‌జి‌  ఆడుతున్నారు. గేమ్‌లు కేవలం కాలక్షేపాని కోసం ఆడాలే తప్పా.. దానికే బానిసలు అవకూడదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అనేక చోట్ల ఈ గేమ్ నిషేధించాలని ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ముంభైకి చెందిన 18 ఏళ్ల కుర్రాడు తనకు పబ్ జి ఆడటానికి ఫోన్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా తెలిసిందే. Telugu News Man Escaped From Home Did Not Play The Pubg Game malesiya