భార్య చనిపోయిందని  రూ.కోటి  ఇన్సూరెన్స్ నొక్కెయ్యాలనుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య చనిపోయిందని  రూ.కోటి  ఇన్సూరెన్స్ నొక్కెయ్యాలనుకున్నాడు

November 26, 2017

వారెవ్వ తెలివంటే  గీ భార్య భర్తలదే, జరంతల మిస్సయ్యిందగనీ  లేకపోతెనా.. కోటీ రూపాయలు  ఈళ్ల ఖాతాల వచ్చి పడుతుండే. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు  చెందిన సయ్యద్ షకీల్, అతని భార్య నజియా 2012 లో ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి  కోటి రూపాయల పాలసీ తీసుకున్నరు.

అయితే అప్పటినుండి పాలసీనీ  ఐదు సంవత్సరాలు మంచిగనే మేంటేన్ చేస్కుంట వస్తున్రు.  కానీ ఈమధ్యనే ఈ భార్య భర్తలకు సక్కటి ఆలోచన వచ్చింది. అదేందంటే  ఎవలో ఒకలం చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్ తోని గ కోటి రూపాయలు కొట్టెద్దాం అని ప్లాన్ ఏస్కున్నరు. అయితే తన భార్య చనిపోయినట్టు సయ్యద్ ఓ నకిలీ డెత్ సర్టిఫికెట్ ను నెలరోజుల కింద బ్యాంకోళ్లకు ఇచ్చిండు. తీరా బ్యాంకోళ్లు ఎంక్వైరీ ఇంటికస్తే స్వయాన చనిపోయిందని చెప్పిన అతని భార్యే వచ్చి తలుపు తీసింది. ఇగేముంది బ్యాంకోళ్లు సక్కగ వొయ్యి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చిన్రు.

ఇగ పోలీసోళ్లు భార్య భర్తలిద్దరి మీద కేసు నమోదు జేశిన్రు. కనీ దొర్కినంక ఇప్పుడు అన్కుంటుడచ్చు మనోడు.. ‘అబ్బా  గ కోటిరూపాయలు ఖాతాల పడేదాక భార్యను అండర్ గ్రౌండ్ల ఉంచేదుండే’ అని. అయినా చేసిన తప్పు, దొంగతనం ఎన్ని రోజులని దాగుతది శెప్పున్రి, ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండ బైటవడ్తది.