ఈ వెధవను పట్టిస్తే రూ.25 వేలు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వెధవను పట్టిస్తే రూ.25 వేలు !

February 17, 2018

మనుషులు విచక్షణ కోల్పోయి ఎంతగా బలి తెగిస్తున్నారో  ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం. ఓ వెధవ బస్సులో అందరూ చూస్తుండగానే ఓ ఆడపిల్ల పక్కన కూర్చొని  వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థి డీటీసీ బస్సులో వెళుతోంది. బస్సు మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే పక్కనే కూర్చున్న ఓ నడివయసు వ్యక్తి  బుద్ధి లేకుండా  హస్త ప్రయోగం చేశాడు.

అతని చర్యకు ఆశ్యర్యపోయిన యువతి  కేకలు వేసింది. బస్సులో అంత మందున్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు.  దీనితో ఆ యువతే  సెల్ఫోన్ లో అతని దుశ్చర్యను వీడియో తీసి  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అంతేకాదు డిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

అతన్ని పట్టించినా, ఒకవేళ ఆచూకీ తెలిపినా కూడా రూ.25 వేలు పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు.  ‘బస్సులో అంతమంది ఉన్నా కూడా అతని చర్యకు ఏ ఒక్కరూ స్పందించలేదు. అడ్డు చెప్పలేదు. సమాజం మరీ ఇంత దారుణంగా తయారైంది , మనుష్యుల్లో మానవత్వం మంటగలిసిపోయింది’ అని ఆ యువతి విచారణ వ్యక్తం చేశింది.