అత్త మీద కోసం దుత్త మీద చూపించినట్టు ఓ వ్యక్తి తన తల్లి మీద కోపాన్ని ముద్దొచ్చే బుజ్జి కుక్క పిల్లలపై చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం తొమ్మిది కుక్క పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. గుణ (35) అనే వ్యక్తి తమిళనాడులోని మీనంబాక్కం దగ్గర ఉన్న అనకపుతూర్లో పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే మూడురోజుల కిందట తల్లితో ఏదో విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్లకుండా వీదుల్లో తిరుగుతూ ఫుల్లుగా తాగడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో పక్కనే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్న నెలన్నర వయసున్న కుక్క పిల్లలు అతని చూసి మొరిగాయి. అంతే కోపంతో ఊగిపోతూ తొమ్మిది కుక్కపిల్లలను చంపేశాడు. ఆ తర్వాత నిర్మాణ బిల్డింగ్కు దూరంగా ఉన్న ఇంకో వీధిలో వాటిని పడేశాడు. అయితే కార్తీక్ అనే వ్యక్తి కనిపెట్టడంతో ఈ విషయం బయట పడింది.కార్తీక్ స్థానికంగా నివాసం ఉంటాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో చిన్న చిన్న కుక్క పిల్లలు తల దాచుకుంటున్నాయి. ఆ బిల్డింగ్ ఓనర్ కూడా వాటిని అక్కడ నుంచి వెళ్ల గొట్టలేదు. రోజు ఆఫీస్ కు వెళ్లే సమయంలో కార్తీక్ వాటికి తినడానికి ఏదైనా పెట్టేవాడు. కాని సోమవారం రోజు కుక్కపిల్లలు కనిపించకపోవడంతో వీధంగా వెతకగా తొమ్మిది కుక్కపిల్లలు చనిపోయి ఉండడం అతని కంటపడింది. గునాపై అనుమానంతో పోలీసలుకు కంప్లైంట్ ఇచ్చాడు. గునాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తే తనే చంపినట్లు ఒప్పుకున్నాడు. ‘తన తల్లితో గొడవ పడ్డానని, వీధిలో వెళ్తుంటే ఆకుక్క పిల్లలు నన్ను చూసి మొరిగాయి అందుకే వాటిని చంపాను’ అని పోలీసుల విచారణలో చెప్పాడు. గునాపై జీవ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు.