హృదయ విదారకం.. తాటిచెట్టుపై కల్లు గీస్తూ..

తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటి కల్లు తీసేందుకు వెళ్లిన ఓ కల్లు గీత కార్మికుడు తాటిచెట్టుపై మృతిచెందాడు. కృష్ణగిరి జిల్లా కంజనూరుకు చెందిన గణేషన్ కల్లుగీత కార్మికుడు. రోజులానే ఆదివారం కూడా కల్లు తీసేందుకు తాటి చెట్టుపై ఎక్కాడు. పాపం అదే సమయంలో చెట్టుపైన గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు… అతడ్ని కిందకు దించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో… వారు రంగంలోకి దిగారు. కానీ వారి వద్ద తాటిచెట్టు ఎత్తుకు సరిపడా పొడవున్న నిచ్చెన లేకపోవడంతో.. జేసీబీని తీసుకొచ్చారు. జేసీబీ సాయంతో.. తాటిచెట్టును కదిలించి.. గణేషన్‌ మృతదేహాన్ని కింద పడేలా చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు కారణంగానే గణేషన్‌ చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు.Telugu News man suffers with heart attack on palm tree dies in tamil nadu