mictv telugu

అక్రమసంబంధం పెట్టుకుందని పార్టీ ఇచ్చాడు..

February 13, 2019

భార్యలు, ప్రియురాళ్లు అక్రమ సంబంధం పెట్టుకుంటే మన దేశంలో సీన్ మామూలుగా ఉండదు. దాడులు, హత్యలు.. నానా బీభత్సం చేస్తారు భర్తలు, ప్రియుళ్లు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం చాలా ఉదారంగా ఉంటారు. ఎన్నో ఏళ్లుగా గాఢంగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు.. తన వెనకాలే, తన స్నేహితుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న ఓ ఆసామి ఏమాత్రం క్షోభ పడలేదు. బంధుమిత్రులను పిలిచి ఘనంగా విందు ఇచ్చాడు.

 

వెనుజులాలో ఈ ముచ్చట జరగింది. బాధితుడి పేరేంటో తెలియదుగాని, ఆ ప్రియురాలి పేరు, ఆమె కొత్త ప్రేమికుడి పేర్ల మాత్రం బయటికొచ్చాయి. ఆమె పేరు డలియానా, అతని పేరు ఆల్బర్టో సోబల్వారో. వీరిద్దరూ తనను చీట్ చేశారంటూ ఆ పెద్దమనిషి విషయం అందరికీ చెప్పి, ఎంజాయ్ చేయండని కోరాడు. ఒకపక్క గుడ్లనీళ్లు కుక్కుకుంటూనే ఆమె తనను ఎలా మోసం చేసిందో వివరించాడు. ఆమె సెల్ ఫోన్‌కు సోబర్వాలో పంపిన మెసేజీలను ప్రదర్శించాడు. ఇదేదో సామాన్యుల గొడవ అయితే పెద్దగా రచ్చ అయ్యేది కాదు. డలియానాను వలలో వేసుకుంది స్వయంగా దేశాధ్యక్షుడైన మాదురో సన్నిహితుడు, ఎంపీ కావడంతో అల్లరల్లరి అవుతోంది. సాబల్వారో నాకు 20 ఏళ్లుగా మంచిమిత్రుడు. కానీ నా వెనుక మోసం చేశాడు. నా ప్రేయసిని వల్లో వేసుకున్నాడు… వారిద్దరికి నా ధన్యవాదాలు..’ అని అతడు మైక్రో ఫోన్ పట్టుకుని చెబుతోంటే ఆ ప్రియురాలు పక్కనే నుంచుని మిడిగుడ్లతో చూసింది. అతని చేతిలోని తన ఫోన్ ను లాక్కోవాలని యత్నించగా, అతడు దాన్ని స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. telugu news Man throws party to announce girlfriend is having affair with best friend of 20 years