మంచులక్ష్మి గ్లామరస్ ఫోటోషూట్ - MicTv.in - Telugu News
mictv telugu

మంచులక్ష్మి గ్లామరస్ ఫోటోషూట్

March 8, 2018

మంచువారి వారసురాలు ఎప్పుడూ లేంది హాట్‌హాట్‌గా ఓ ఫోటో‌షూట్‌లో పాల్గొంది. అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో బిజీగా వుంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా వుంటుంది మంచులక్ష్మి.

తన కెరీర్‌లో మంచులక్ష్మి గ్లామర్ పరమైన పాత్రలు ఎప్పుడూ చేయలేదు. లేటెస్ట్‌గా మంచు లక్ష్మి చేసిన ఫొటో షూట్ షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఎప్పుడూ లేనంతగా గ్లామర్ మెరుపులు మెరిపించింది. మంచిలక్ష్మి ఫోటో షూట్ తాలూకు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్లామర్ రోల్స్‌కు మంచులక్ష్మి సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్మీబాంబ్, బుడుగు వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా అవి ఆశించిన ఫలితాన్ని పొందకపోవటంతో లక్ష్మి గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతోందని ఫిల్మ్‌నగర్ టాక్.