‘మా’ పై విరుచుకుపడ్డ మంచు విష్ణు... - MicTv.in - Telugu News
mictv telugu

‘మా’ పై విరుచుకుపడ్డ మంచు విష్ణు…

April 19, 2018

నటి శ్రీరెడ్డికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెకు( శ్రీరెడ్డి ) సభ్యత్వం ఇవ్వకపోవడంపై హీరో మంచు విష్ణు అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘మా ’ చేసిన పనిని విమర్శిస్తూ ఆయన ఓ లేఖను రాశాడు. శ్రీరెడ్డి విషయంలో ‘మా’ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘మా’ అసోషియేషన్‌లో 900 మంది సభ్యత్వం  కలిగి ఉన్నారు. ఆమెతో వారు కలిసి నటించకూడదంటూ నిషేధించారు. ఆ 900 మందిలో తాను ,తన తండ్రి, తన సోదరుడు, తన సోదరి ఉన్నామని,మమ్మల్ని కలిపే ఆ నిషేధం విధించారా? అని ప్రశ్నించారు.ఆ తర్వాత సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాలపై ఆమె విమర్శలు చేయగానే , నిషేధం ఎత్తి వేశారని ఎద్దేవా చేశాడు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ‘మా’ పరువు పోతోందని అన్నాడు. టాలావుడ్‌ను ప్రజలు, మీడియా చులకగా చూస్తున్నారని పేర్కొన్నాడు.

‘ఓ నటుడిగా, ఓ నిర్మాతగా  నేను ఎవరితో కలసి నటించాలి, ఎవరిని సినిమాలో పెట్టుకోవాలి అనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు  ఉంటుంది. ఆ విషయంలో జోక్యం చేసుకోవడానకి ఎవరికీ అధికారం లేదని’ విష్ణు చెప్పాడు. ఆ విషయంలో ‘మా’ ఆదేశాలు జారీ చేయడం మంచిది కాదని తెలిపాడు. మీ చర్యలతో ‘మా’కు చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నాడు. క్యాస్టింగ్ ఆరోపణలు సినీ పరిశ్రమకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని.. ఈ విషయంలో గ్రీవియెన్స్ సెట్ ఏర్పాటు చేసే బాధ్యతను ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించాలని సూచించాడు.