చాలా మంది హీరోయిన్లకు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఉంటుంది. వాళ్లలో జ్యోతిక ఒకరు. పదిహేన్ల క్రితమే జ్యోతికకు అలాంటి అవకాశం వచ్చింది. ‘డుమ్ డుమ్ డెమ్’లో మాదవన్, జ్యోతిక కలసి నటించారు. అయితే మణిరత్నం డైరెక్షన్ లో కాదు ఆయన శిష్యుడు అళగం పెరూమాళ్ దర్శకత్వం వహించారు. కానీ ఆ మూవీకి రచయిత, నిర్మాత మణిరత్నం.
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మణిరత్నం డైరెక్షన్ లో జ్యోతికకు నటించే అవకాశం వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక ఆచితూచి సినిమాలు చేస్తోది. ప్రస్తుతం ఆమె బాలా దర్శకత్వంలో ‘నాచియర్’ మూవీలో నటిస్తోంది. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో నటించబోతున్నాఅన్ని మణిసార్ దగ్గర అనౌన్స్ చేయడానికి అనుమతి తీసుకున్న అని జ్యోతిక చెప్పింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.