నన్ను చంపాలని  మణిశంకర్ పాక్‌కు చెప్పాడు - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను చంపాలని  మణిశంకర్ పాక్‌కు చెప్పాడు

December 8, 2017

‘ పాకిస్తాన్ వెళ్ళిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్‌ అక్కడ నా తలకు వెలకట్టారు ’ అని  ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం భాభర్‌లో జరిగిన బహిరంగ సభలో  అయ్యర్‌పై విరుచుకుపడ్డారు. ‘ అక్కడ నా అడ్డు తొలగించాలని వారితో మంతనాలు జరిపిన మహానుభావుడాయన. నా అడ్డు తొలిగితే భారత్ –  పాకిస్తాన్‌ల సంబంధాలు శాంతియుతంగా వుంటాయని సుపారీ అందించిన విషయం సోషల్ మీడియాలో నేను చదవలేదా.. నాకు తెలియదా ? పాకిస్థాన్ వెళ్ళినవారు మోడీని అడ్డు తొలగించుకోవడం గురించే మాట్లాడుతున్నారు ’ అని విమర్శించారు.నాకు గుజరాత్ ప్రజల అండదండలున్నాయి. వారి ఆశీస్సులున్నాయి గనక నాకేమీ జరగదు అన్నారు. నేను చేసిన తప్పేంటి ? ఎందుకు నా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు ? అని ఘాటుగా ప్రశ్నించారు.  ఇదిలావుండగా గుజరాత్ శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలుపు కోసం మోడీ గట్టిగా కృషి చేస్తున్నారు.